Sunday, January 19, 2025

గురువారం రాశి ఫలాలు(09-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. బుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంగీత, సాహిత్యాలపై ఆనక్తి చూపుతారు.

మిథునం – ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.

కర్కాటకం – కుటుంబ సమన్యలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. దూర ప్రాంతాలనుండి విలువైన సమాచారం అందుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

సింహం – వృత్తి-వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.ఋణాలు కొంత వరకు తీరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. స్వల్ప ధనలాభం పొందుతారు.

కన్య – ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులుంటాయి. వాహన సౌఖ్యం పొందుతారు.

తుల – కుటుంబ నభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చికం – దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన వస్తు లాభం. గృహం, వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు.

ధనుస్సు – సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. స్వల్ప ధనలాభ సూచన.

మకరం – వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు నకాలంలో పూర్తి చేస్తారు. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. నూతన విద్యలపై ఆసక్తి కలిగి వుంటారు.

కుంభం – చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తులతో సఖ్యత పెరుగుతుంది.

మీనం – బంధువుల ద్వారా ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News