Thursday, January 23, 2025

శుక్రవారం రాశి ఫలాలు(10-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – స్నేహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు. నమిష్టిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి.

వృషభం – మంచి ప్రోతాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. అస్తవ్యస్తంగానున్న చాలా వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. వాహనం నడిపేటప్పుడు  జాగ్రత్త వహించండి.

మిథునం – భవిష్యత్తులో ఉపకరించే అంశాల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. వాహనం మార్పు చేసే సూచనలు. విలువైన ప్రతాలను అందుకుంటారు. ఆహార నియమాలను పాటిస్తారు.

కర్కాటకం – కృత్రిమంగా ఏర్పడే చికాకులు స్వల్పంగా ఇబ్బందిని కలిగిస్తాయి. గృహమరమ్మత్తులు సాగిస్తారు. మాయా మాటలతో మిమ్మల్ని మోసపుచ్చేవారు మీ దగ్గరలోనే ఉంటారు. జాగ్రత్త వహించండి.

సింహం – నత్తనడకన సాగుతున్న పనులలో చురుకుదనం తీసుకురావడానికి విశేషంగాశ్రమిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులకు నేడు అనుకూలం. వైద్యున్ని మార్పు చేస్తారు. స్వల్ప ధనలాభ నూచన.

కన్య – సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటారు. కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉన్నతమైన భావాలను కలిగిఉంటారు.

తుల – రాజీలేని ధోరణిని కనబరుస్తరు. ధనాన్ని కన్నా ధర్మమే ముఖ్యమని భావిస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నఆత్మీయులను హెచ్చిరిస్తారు. వాహన సంబంధమైన విషయాలు ప్రతికూలం.

వృశ్చికం – ఆశ్చర్యం కలిగించే  సమాచారాన్ని తెలుసుకుంటారు. అపాత్ర దానం చేస్తారు. దృష్టాచారాలను సంర్ధవంతంగా త్రిప్పికొడతారు. సంతృప్తిని అలవర్చుకుంటే జీవితం సుఖమయమవుతుంది.

ధనుస్సు – ఎన్నో రోజులుగా రాకుండా చిక్కుకు పోయిన ధనం చేతి కంది వస్తుంది. బంధువుల నుండి శుభవార్తాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలం. మీ పైన నిష్కారణమైన ఈర్చా, ద్వేషాలు అధికమవుతాయి.

మకరం – నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మీ అధికార పరిధిని దాటి ముందు దృష్టితో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఓర్చు, సహనం, కలిగి ఉండటం చెప్పదగినది సూచన. ఖర్చులు మితిమీరి ఉంటాయి.

కుంభం – టెక్నికల్ రంగంలోని వారికి అనుకూలం. వాస్తవాలను పరిశీలించి వాటి ప్రాతిపదికగా నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త కార్యక్రమాలకు: శ్రీకారం చుడతారు.

మీనం – ప్రయోజనాలను పదిలంగా పరిరక్షించుకుంటారు. శ్రమాధికం వలన ఒత్తిడిని కలిగి ఉంటారు. ఋణ సంబంధమైన విషయాల నుండి ఉపిరి పీల్చకోగలుగుతారు. ప్రతిష్ట పెరుగుతుంది.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News