Thursday, January 23, 2025

ఆదివారం రాశి ఫలాలు(10-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు.గృహనిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి.పూజలలో పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ.

వృషభం – పనులలో ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు చాలా దూరంగా వుండండి. సోదరుల కలయిక.

మిథునం – భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహన, భూయోగాలు.

కర్కాటకం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ధనలాభం.

సింహం – పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. నూతన విద్యా ఉద్యోగవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు

కన్య – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు కొనుగోలు చేస్తారు.

తుల – వ్యక్తిగత సమస్యలు ఎదురై చికాకుపెట్టిన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయత్నాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

వృశ్చికం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ముఖ్యమైన పనులలో సన్నిహితులు సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు.

ధనుస్సు – విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు.

మకరం – మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కళా, రాజకీయ రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సంతానంనకు ఉద్యోగయోగాలు.

కుంభం – వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు కొంతవరకు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

మీనం – వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. వస్తు లాభం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News