Thursday, December 19, 2024

మంగళ వారం రాశి ఫలాలు(11-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాకులాడుతారు.

వృషభం – పెద్దలను సంప్రదించి స్థిరాస్తికి సంబందించిన వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని సాగిస్తారు. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు.

మిథునం – స్వయంకృతాపరాధాలు చోటుచేసుకుంటాయి. వృత్తి- వ్యాపారాలను విస్తరిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబంలో ఏర్పడిన విభేదాలను పరిష్కరిస్తారు.

కర్కాటకం – మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు సాగిస్తారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు.చేపట్టిన పనులలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.

సింహం – స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అయినప్పటికీ నిదానంగా వ్యవహరించడం మంచిది.

కన్య – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనాధ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు మీ శక్తి కొలది ఆర్థిక సహాయం చేస్తారు. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

తుల – కుటుంబ పరంగా ఎదురయ్యే స్వల్పమైన ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.

వృశ్చికం – మధ్యవర్తిత్వ పరిష్కారాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం నూతన ఆదాయ మార్గాలు లభించే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో సల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు – మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి బలమైన కారణం ఉంటుంది. కనుక ఖర్చులను బరువుగా భావించరు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది.

మకరం –  పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. దూరప్రాంతాల నుండి మీకు అనుకూలించే శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు.

కుంభం –  ఆరోగ్య సమస్యలను కొంతవరకు అధిగమిస్తారు. సంఘంలో స్థాయిని పెంచుకోవడానికి ఏమి చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు సాగిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

మీనం – పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News