Sunday, December 22, 2024

సోమవారం రాశి ఫలాలు(12-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు.

వృషభం –పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు.

మిథునం –కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం.

కర్కాటకం –శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం –పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు.

కన్య –కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. విద్యా, ఉద్యోగవకాశాలుపొందుతారు.

తుల –కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టు దక్కించుకొంటారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం –పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనున్సు –ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు.

కుంభం – ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలుకొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు.

మీనం –రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News