Wednesday, January 29, 2025

మంగళవారం రాశి ఫలాలు (12-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.నూతన కార్యక్రమాలు రూపు దాల్చుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. స్వల్పంగా ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి.

వృషభం: సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహ,ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు అర్జిస్తారు. పొదుపు విషయంలో అలసత్వం వద్దు.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెట్టినా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మిత్రుల నుండి రుణ ఒత్తిడిలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

కర్కాటకం: మిత్రులతో,బంధువర్గంతో ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటుంది. మిత్రుల నుండి వ్యాపారపరమైన కీలక సమాచారం అందుకుంటారు.ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్టు ఉంటుంది.

సింహం: సాధ్యమైనంతవరకు వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండుట శ్రేయస్కరం. క్రయవిక్రయాలలో ఆదమరిచి ఉంటే ఆదాయం ఆవిరైపోతుంది. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

కన్య: గతంలో చేసిన బాకీలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహిత వర్గంతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు నూతన విద్యా విధానం అవలంబిస్తారు.

తుల: కుటుంబ సభ్యులతో,బంధువులతో ఏర్పడిన మనస్పర్ధలు,వివాదాల పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఎల్లకాలం ఎవరూ మనకు అండగా ఉండరని గ్రహిస్తారు.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుండి వ్యాపార లావాదేవీల విషయంలో కీలక సమాచారం అందుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.జీవిత భాగస్వామితో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. నిలకడమైన జీవితం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి.ఆప్తుల అండదండలు అందుతాయి.

మకరం: తలపెట్టిన ముఖ్య కార్యక్రమాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి. జీవిత భాగస్వామితో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి జాగ్రత్త వహించండి.

కుంభం: వృత్తి- వ్యాపారులు లాభాల బాట పడతారు. అనుకున్న దానికన్నా లాభసాటిగా సాగుతాయి. నిబద్ధతతో నిలుపుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బాకీలు తీరుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.

మీనం: ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. వాహనయోగం గోచరిస్తుంది.

 

Saturday rasi phalalu

సోమేశ్వర్ శర్మ, వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News