Wednesday, January 22, 2025

బుధవారం రాశి ఫలాలు (13-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. మనసుకు నచ్చిన బాట మనసు చెప్పే మాట విని ముందుకు సాగండి.

వృషభం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు సూచనలు అక్కరకు వస్తాయి. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు.

మిథునం: అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నూతన కార్యక్రమాలలో జీవిత భాగస్వామి సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. కొత్త పెట్టుబడులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది.

కర్కాటకం: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన సౌఖ్యం కలుగుతుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. అభివృద్ధికి ప్రణాళిక రచిస్తారు.

సింహం: చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: ఆధ్యాత్మిక కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి చురుకుగా పాల్గొంటారు. పోటీ పరీక్షలు,ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. సంఘంలో మాటకు విలువ,పరపతి పెరుగుతుంది. సహోదరులతో వివాదాలు ఏర్పడతాయి.

తుల: ఇన్నాళ్లు చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ముఖ్యమైన వారితో అనవసరమైన వితండవాదం చేస్తారు. తర్వాత ఎంత బాధపడిన ఏం లాభం జాగ్రత్త వహించండి. మౌనమే అన్నిటికీ సమాధానం మంచిదని నిర్ణయించుకుంటారు.

వృశ్చికం: మిత్రులతో ఏర్పడిన ఆర్థిక వివాదాలు రూపుమాసిపోతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. రాజకీయ,పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.

ధనస్సు: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలోని పెద్దలతో పరిచయాలు పెరిగి,ఉన్నతికి బాట వేస్తాయి.దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి.కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు.

మకరం: నూతన పెట్టుబడులు, కార్యక్రమాలకు శ్రీకరం చుడతారు. చేయబోయే మంచి పనులకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వాయిదాలు వేసుకుంటూ వస్తున్న ముఖ్యమైన పనులు శరవేగం అందుకుంటాయి.

కుంభం: చేయ తలపెట్టిన పనులలో ఆలస్యం అయినా చివరాంతకు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉన్నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభాలు,వస్తులాభాలు పొందుతారు.కొంత ఆలస్యం అయినా మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మీనం: ఉద్యోగస్తులకు స్థానచలనం గోచరిస్తున్నది. టెండర్లు లాభిస్తాయి.ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో ఏర్పడిన భూతగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.ఆప్తుల నుండి సందేశాలు అందుతాయి.

 

Saturday rasi phalalu

సోమేశ్వర్ శర్మ, వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News