Monday, December 23, 2024

ఆదివారం రాశి ఫలాలు(14-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సంతానం నుండి ధనలాభం.

వృషభం – అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు మాటల సందర్భంలో నిదానం అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం.

మిథునం – బంధువుల ద్వారా ధన, వస్తు, లాబాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సన్నిహితుల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కర్కాటకం – ఋణవత్తిడులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. వస్తు లాభాలు

సింహం – మిత్రులతో ఏర్పడిన స్వల్ప విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. గృహవాహన యోగాలు.

కన్య –  వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతారు.

తుల – ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానమునకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

వృశ్చికం – అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వస్తు, లాభం.

ధనున్సు – కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది.

మకరం – జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారించుకుంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం.

కుంభం – సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విందు, వినోదాలు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందుస్తారు.

మీనం – వృత్తి, వ్యాపారాలలో ఊహించని లాభాలు పొందుతారు. ఎదురు చూడని అవకాశాలు లభిస్తాయి. ధనలాభం శుభవార్తలు వింటారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News