Thursday, December 26, 2024

శుక్రవారం రాశి ఫలాలు(14-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –  కార్యక్రమాలను, ముఖ్యమైన వ్యవహారాలను సక్రమంగా నడిపించడానికి కావలసిన వ్యక్తులను ఎంపిక చేసుకోగలుగుతారు. సకాలంలో నిర్వహించే కరస్పాండెంట్స్ వలన లాభలు అందుకోగలుగుతారు.

వృషభం – పరిస్థితులకు తలోగ్గి ఇష్టం లేని వారితో పని చేయవలసి వస్తుంది. మీ పరోక్షంలో మీ పై నేరారోపణ  చేస్తున్న వారిని గుర్తించగలుగుతారు. రాయబార యత్నాలు, మధ్యవర్తిత్వాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

మిథునం – యోగాభ్యాసాలు ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. పిల్లల చదువులు అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి.

కర్కాటకం – ఇతరుల లోపాలను ఏకరూవు పెట్టేముందు ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది.  వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి- ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

సింహం – సంతాన కుటుంబ విషయ వ్యవహారాలపైన  ప్రత్యేక దృష్టిని సారిస్తారు. విలువైన ఆభరణాలు, అతి కీలకమైన డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించండి.

కన్య –  మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం చికాకు కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి.

తుల – పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. దైనందిన జీవితంలో స్వల్ప మార్పులు గోచరిస్తున్నాయి.

వృశ్చికం – రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కొన్ని విషయాలలో నిదానంగా ఉండటం మంచిది.

ధనుస్సు – పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం – మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

కుంభం – మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు.

మీనం – క్రయవిక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలరు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సంతానమునకు సాంకేతిక విద్యా అవకాశాలు పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News