Sunday, January 19, 2025

గురువారం రాశి ఫలాలు(14-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: నూతన వ్యక్తులతో పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆశించిన దానికన్నా అధికమే లభ్యమవుతుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

వృషభం: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటాబయట మీ మాటే చెల్లుబాటు అవుతుంది.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వినోదయాత్రలు చేపడతారు.ఆర్థికస్థితి ధన రూపేణ కాకుండా వస్తూ రూపేణా అందుతుంది.

మిథునం: ఆరోగ్య విషయంలో అలసత్వం వద్దు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం జరిగిన నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆహ్లాదకరమైన వాతావరణం కలుగజేస్తుంది.

కర్కాటకం: శ్రమ తప్ప ఫలితం ఉండదు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు రావడంతో ఆనందంగా ఉంటారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు రూపుమాసిపోతాయి. మిత ఆహారం శ్రేయస్కరం.

సింహం: వృత్తి – వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.చేపట్టిన ప్రయత్నాలలో సానుకూల స్థితి ఏర్పడుతుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.మీ చిరకాలవాంఛ నెరవేరబోతున్నది.

కన్య: రెండు మూడు విధాలుగా ధనలాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రాబోతున్నాయి.

తుల: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నాఅవసరాలకు డబ్బు అందుతుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.శ్రమ తప్పదు ఫలితం దక్కదు.పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

వృశ్చికం: కుటుంబ సభ్యుల నుండి శుభకార్యాల నిర్వహణ గురించి కుటుంబ సభ్యులతో చర్చలు సాగిస్తారు.టెండర్లు, కాంట్రాక్టులు లాభిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు.ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం.

ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.ఆర్థిక లావాదేవీలు లాభ సాటిగా సాగుతాయి.దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. గతంలో జరిగిన పొరపాటులను మళ్ళీ జరగకుండా ప్రయత్నిస్తారు.

మకరం: అనవసర విషయాలకు వివాదాలకు దూరంగా ఉండండి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.అనాలోచిత నిర్ణయాల వలన లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.

కుంభం: గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంఘంలోని ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాలు కురిపిస్తాయి.జీవితంలో పైకి ఎలా ఎదగాల అనే ఆలోచనలు చేస్తారు.

మీనం: ఆప్తమిత్రులనుకుంటారు కానీ అప్పులో ముంచుతారు.అన్యులతో ఆదమరిచి ఉండకండి.చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరము ఆర్థికపరంగా స్వల్ప ధన లాభం. వాహనయోగం గోచరిస్తున్నది.

Saturday rasi phalalu

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News