మేషం;- శ్రమకి తగిన ప్రతి ఫలం దక్కుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు. ఆస్థి గొడవలకి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంటారు.
వృషభం :- సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకొంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తున్నది. విలువైన వస్తు వస్త్రాభరణాల కొనుగోలుకై విరివిగా ధనం వెచ్చిస్తారు.
మిథునం :- నిరుద్యోగులకు శుభవార్తలు అందుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తనం వద్దు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
కర్కాటకం :- కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలుగుతాయి. స్వల్ప ధనలాభం. ఆహార విషయంలో మెలకువగా ఉండాలి.
సింహం :- పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విరివిగా వ్యాప్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు.
కన్య:- కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి-వ్యాపారాలు విస్తరింప చేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
తుల:- ముఖ్యమైన కార్యక్రమాలలో సన్నిహితుల సాయం అందుకొంటారు. దూర ప్రయాణాలు అత్యవసరం అయితేనే చేయండి. బంధువులతో ఎదురైన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. సాహసాల విషయాలలో జాగ్రత్త అవసరం.
వృశ్చికం :- కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహన సౌఖ్యం ఉన్నది.
ధనుస్సు :- ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. విద్యార్ధులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
మకరం:- ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దీర్ధకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వస్తు లాభం. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.
కుంభం:- వృతి-ఉద్యోగాల పరంగా, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు ఒక కొలిక్కి వస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.
మీనం:- విద్య ఉద్యోగవకాశాలు పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.
సోమేశ్వరశర్మ : 8466932223,9014126121