Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(15-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం.

వ్యషభం –  అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాల వల్ల కొంత  ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం.

మిథునం – రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. నూతన వస్తు కొనుగోలు.

కర్కాటకం – దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. తండ్రి నుండి ఆస్తి లాభాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం – అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. సంఘంలో ఆదరణ పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కన్య –  ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వరంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు.

తుల – ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. వస్తు లాభాలు.

వ్యశ్చికం – అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహ యత్నాలు కలిసి వస్తాయి.

ధనుస్సు – కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం – రుణాలు తీరి ఊరట చెందుతారు. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.వస్తు లాభం.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News