Sunday, December 22, 2024

ఆదివారం రాశి ఫలాలు(17-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: కార్యాజయం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.స్వల్ప ధన లాభం.అనుకోని అవకాశాలు లభిస్తాయి.వాటిని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు అరుదుగా లభిస్తాయి. విద్యార్థులు కార్యసాధకులుగా వారిని వారు మలుచుకోవాలి.

వృషభం: ఆదాయం ఆశించినంత ఉండదు, రాబడి తగ్గుతుంది.చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.సన్నిహితులతో ఏర్పడిన ఆర్థికపరమైన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అలసత్వం వద్దు.

మిథునం: కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు అనవసరం.ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉన్నా సహోదర వర్గం సమయానికి అండగా నిలబడతారు. నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇతరులతో చర్చించేటప్పుడు మాటను అదుపులో ఉంచుకోండి.

కర్కాటకం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.దూరప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కార్యాలయాలలో సహ ఉద్యోగులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మధ్యస్థంగా ఉంటుంది.

సింహం: ఎంత కష్టపడినా ఫలితం ఉండదు.ముఖ్యమైన విషయ వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు లాభాల బాట పడతాయి.

కన్య: ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆర్థికపరమైన రాబడి మెరుగుపడుతుంది.

 

తుల: సంతానం నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. చాకచక్యంగా సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.

వృశ్చికం: అనవసర వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. ఆకస్మిక ధన,వస్తు లాభాలు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో అలసత్వం వద్దు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు: నూతన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.పోటాపోటీ పరీక్షలు,ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు.లాభాలు అందుకుంటారు.

మకరం: సన్నిహితులతో ఏర్పడిన ఆర్థికపరమైన లావాదేవీల వివాదాలు సద్దుమణుగుతాయి.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.అనుకొని విధంగా ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం: తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.కాంట్రాక్టులు లాభిస్తాయి.బంధువులను చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని విషయాలలో జాప్యం జరిగినా సమయానుకూలంగా పూర్తి అవుతాయి.

మీనం: భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.చేపట్టిన ముఖ్య విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News