Thursday, December 19, 2024

సోమవారం రాశి ఫలాలు(18-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: దీర్ఘకాలిక రుణ బాధలు కొంతవరకు తీరుతాయి.జీవిత భాగస్వామి నుండి ధన లాభాలు పొందుతారు.బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కరించుకుంటారు. మానసిక ధైర్యం విడవద్దు. స్వల్ప ధన లాభం.ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం.

వృషభం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు.వివాహ ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు,శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథునం: ధన వస్తు,లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. జీవితంలో తీసుకున్న నిర్ణయాలు మీవై ఉండాలి.సంతానం వృద్ధిలోకి వస్తారు.వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.పనులు నిదానంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన.ధైర్యంగా ఎదుర్కొని సకాలంలో పూర్తి చేస్తారు.మానసిక ధైర్యం విడవద్దు. స్వల్ప ధన లాభం.

సింహం: ఉద్యోగాలలో పదోన్నతులు,ఇంక్రిమెంట్లు పొందుతారు.ఇంట్లో ఖర్చులు భారాన్ని కలుగచేస్తాయి.గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.దూరప్రయాణాలు లాభిస్తాయి.

కన్య: జీవిత భాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంఘసేవ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు.

తుల: భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహన యోగం గోచరిస్తున్నది.ఇంటిలో మీ ప్రమేయంతో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అలంకరణ సామాగ్రి కొనుగోలుకై ధనం నీళ్లలా ఖర్చు చేస్తారు.

వృశ్చికం: సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగ,వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతారు.

ధనస్సు: ఇంటాబయటా మీదే పై చేయిగా ఉంటుంది. సంతానం యెక్క నూతన విద్య,ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ఆనందాలకు హద్దు ఉండదు.

మకరం: కొత్త కార్యక్రమాలకు నాంది పలుకుతారు.మిత్రులను,ఆప్తులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వాహన సౌఖ్యం.రాబడి కి మించిన ఖర్చులు పెరుగుతాయి.జాగ్రత్త వహించండి.ఆరోగ్య విషయంలో మెలకువ అవసరము.కష్టానికి తగిన ప్రతిఫలం అంతగా లభించదు.

కుంభం: దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభ ఆహ్వానాలు ఆనందం కలుగచేస్తాయి. టెండర్లు,కాంట్రాక్టులు లాభిస్తాయి.విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.స్థిరాస్తి వృద్ధి చెందుతుంది.ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు.

మీనం: ఆర్థిక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది.సోదర సహోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.ఇతరులతో మాట మాట పెంచుకోవద్దు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News