Sunday, January 19, 2025

మంగళవారం రాశి ఫలాలు..(19-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఆరోగ్యం పట్ల మెలకువ అవసరము.ఉద్యోగాలలో ఒత్తిడిల నుండి బయటపడతారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.రాబడి కూడా పెరుగుతుంది. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృషభం: వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.ఉద్యోగస్తులు పదోన్నతులు, బోనస్ లు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నాఅవసరాలకు డబ్బు అందుతుంది.జీవితంలో మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలలో ఇతరుల జోక్యం అనవసరం.మీ సొంత ఆలోచనలో శ్రేయస్కరం.

మిథునం: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది.

కర్కాటకం: సంతానపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి.నూతన పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరమైన సలహాలు,ధన లాభం పొందుతారు.

సింహం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.నూతన విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.షేర్లు,భూములు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా త్వరగతిన పూర్తి చేస్తారు.వాహన యోగం గోచరిస్తున్నది.

కన్య: పూర్వీకుల ఆస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం.చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు.సంతానం నూతన విద్యా,ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

తుల: జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. శ్రమానాంతరం కాంట్రాక్టులు దక్కుతాయి.ముఖ్యమైన విషయ వ్యవహారాలలో పనులు నిదానంగా సాగుతాయి. రుణ బాధలు తప్పవు.ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం.

వృశ్చికం: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీదే పై చేయిగా ఉంటుంది.భూ, వాహన లాభం.ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు.

ధనస్సు: విందు వినోదాలలో పాలుపంచుకుంటారు.నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు.పాత బాకీలు వసూలు అవుతాయి.పెట్టుబడులకు లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలు,కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక అభివృద్ధి ఉంటుంది.

మకరం: ఆస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలుకుదురుచుకుంటారు.ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం. అవసరాన్ని బట్టి మనుషులు మారతారని గ్రహిస్తారు.కొంత అప్రమత్తత అవసరం. విద్యార్థులు చదవడం నిర్లక్ష్యం చేస్తే మీ భవిష్యత్తు ఇబ్బందులకు గురవుతుందని గ్రహించాలి.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

కుంభం: ఆస్తి పరమైన విభేదాలు తొలగుతాయి.ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కళా,సాహిత్య రంగాల వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చును.ఇంటాబయటా మీద పై చేయిగా ఉంటుంది.

మీనం: పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి- వ్యాపారాలలో పురోగతి కానవొస్తుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్థిపరమైన విభేదాలు తొలగుతాయి.ప్రశాంత వాతావరణము ఏర్పడుతుంది.పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News