Friday, December 20, 2024

శనివారం రాశి ఫలాలు(20-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. రాజకీయ, కళారంగాలలోని వారికి సన్మాన యోగం. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.

వృషభం – కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనలాభం.

మిథునం – వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభం పొందుతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకుంటారు. వస్తులాభం.

కర్కాటకం – ప్రముఖుల నుండి ఆహ్వనాలు అందుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ధనలాభం.

సింహం – భూవివాదాలు తీరుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది. పనులు పూర్తి చేస్తారు. భాగస్వామి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. స్వల్ప ధనలాభం.

కన్య – బంధువుల నుండి ఎదురైన వత్తిడులు కొంత వరకు తీరుతాయి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.

తుల – చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రయాణాలు ముందుకు సాగవు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు.

వృశ్చికం – దూరప్రయాణాలు లాభిస్తాయి. చర్చాగోష్ఠులలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు, లాభాలు పొందుతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు కొనుగోలు సూచన.

ధనుస్సు – కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. చాలా జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం.

మకరం – ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పూర్వపుమిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆదాయమార్గం పెరుగుతుంది. విందు, వినోదాలు.

కుంభం – ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ధనలాభం.

మీనం – సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కొత్త మిత్రుల పరిచయాలు.  వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News