Monday, December 23, 2024

బుధవారం రాశి ఫలాలు.. (20-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: కొత్త మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకున్న దానికన్నా అభివృద్ధి కానవస్తుంది. ఇతర వ్యాపకాలు లేకుండా వ్యాపారం మీద శ్రద్ధ పెడితే వృద్ధి చెందుతుంది. షేర్ల లాభాలు అంతంతే

వృషభం: విద్యార్థులకు పోటీ తత్వం కలగకుంటే వచ్చే పరీక్షా సమయంలో ఇబ్బందులకు గురవుతారు. రుణాలు కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. ఇప్పటినుండి రాబోయే భవిష్యత్తు కోసం ఆలోచనలు చేయకుంటే అంధకారంగా తయారవుతుంది.

మిథునం: శ్రమ అధికంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహా పై కొన్ని పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ధైర్యంతో ముందుకు సాగాలి.

కర్కాటకం: ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణ పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.

సింహం: భూములు,గృహాలు కొనుగోలు చేస్తారు. షేర్ల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు. నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.స్వయంకృతాపరాధం వలన ఆరోగ్యపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి.

కన్య: ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినంత గుర్తింపు మాత్రం అందదు. ఆప్తుల నుండి ధన రూపేణా సహాయం అందుతుంది. ఏ పని చేసినా మొక్కుబడితో కాకుండా నమ్మకంతో చేయండి. తప్పకుండా ఆశించిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తుల: వెనుక ముందు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. విద్యార్థులు నూతన విద్యా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అంత ఆశాజనకంగా ఉండవు.

వృశ్చికం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనయోగం గోచరిస్తున్నది. కొందరితో ఏర్పడిన పేచీలు పెటాకులు అవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఊరట చెందుతారు.

ధనస్సు: న్యాయపరమైన చిక్కులు మీకు ఎదురవుతాయి.మీ ఆత్మస్థైర్యం సడలించవద్దు. అదే మీకు చేయబోయే పనులకు పెట్టుబడి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెట్టినా కూడా నిలకడ మీద పరిష్కార దిశగాఉంటాయి.శ్రమ అధికంగా ఉన్నా ఫలితం దక్కుతుంది

మకరం: ఆనందం ఎంతసేపు నిలవదు.మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి.  సభలు సమావేశాలలో పాల్గొంటారు.ముఖ్యమైన విషయ వ్యవహారాలలో మీ వరకు వస్తేనే సలహాలు సూచనలు చేయండి.తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.

కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.అవసరాలకు గతంలో మీరు ఆదుకున్న వారు మీకు అక్కరకు వస్తారు.సంకోచం లేకుండా సహాయాలను అందుకోండి.నూతన కార్యక్రమాలు క్రమ పద్ధతిలో విజయవంతంగా నిర్వహిస్తారు.

మీనం: నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.  రాజకీయ,వ్యాపార రంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.చేపట్టిన కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆకస్మికంగా వచ్చే లాభాలకు ఉప్పొంగి పోతారు.

సోమేశ్వరశర్మ : 8466932223, 9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News