మేషం :- చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
వృషభం :- ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. సాంకేతిక విద్యావకాశాలు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
మిధునం :- దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు.
కర్కాటకం :- విలువైన వన్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన గౌరవ మర్యాదలు దక్కుతాయి.
సింహం :- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగావకాశాలు.
కన్య :– పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వివాహ పరంగా చేసే యత్నాలు సానుకూల పడతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి.
తుల:- ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం ఉంటుంది. ఆరోగ్య పరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం.
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దీర్ఘకాలికఋణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు అందుకుంటారు. కుటుంబంలోని ఆప్తులకి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ధనుస్సు:- వృత్తి-వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. వాహన యోగాలు గోచరిస్తున్నాయి. పాత మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుసుసుకుంటారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మకరం :- కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. భవిష్యత్తు కోసం పెట్టె పెట్టుబడులకు ఇది తగిన సమయం.
కుంభం :- ముఖ్యమైన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప ఆర్ధిక లాభాలు పొందుతారు.
మీనం :- దీర్ధకాలిక సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడతారు. బంధువుల నుండి విలువైన నమాచారం అందుతుంది. ఆస్థి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. షేర్లు, క్రయ విక్రయాలలో మధ్యస్థ లాభాలు పొందుతారు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225