Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(21-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సౌభాగ్య సిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. స్వల్ప ధన లాభం గోచరిస్తుంది.

వృషభం –  నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు.

మిథునం – పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.అధికారులను ప్రసన్నం  చేసుకునేలా ముందుకు సాగండి.

కర్కాటకం – సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మానసిక ప్రశాంతత లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహం – లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది.

కన్య – శత్రువులతో కొంత జాగ్రత్తగా మెలగడం చెప్పదగినది. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని గ్రహిస్తారు. దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల – బంధుప్రీతి గోచరిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు.

వృశ్చికం – కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం మీకు అందుతుంది.ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు – అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తవుతాయి.

మకరం – ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

కుంభం – మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి.

మీనం – ఆరోగ్యమే మహాభాగ్యమని గ్రహిస్తారు. వృత్తి- ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News