Thursday, December 19, 2024

గురువారం రాశి ఫలాలు(21-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.శ్రమ పెరుగుతుంది.వివాదాలకు దూరంగా ఉండండి.వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం: విందు వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.పాత బాకీలు వసూలు. అవుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.

మిథునం: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభాలు పొందుతారు.

కర్కాటకం: బంధువులను,మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.పనులు నిదానంగా సాగుతాయి.కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

సింహం: నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.  ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.శ్రమ అధికం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరము.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల: మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త చాలా సంతోషం కలిగిస్తుంది. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. స్వల్పదన లాభం పొందుతారు.

వృశ్చికం: పనులు నిదానంగా సాగిన సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ తప్పదు. పెట్టుబడులలో తొందరపాటు వద్దు.

ధనస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం పొందుతారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వస్తువుల సేకరణ చేపడతారు.

మకరం: కృషి ఫలిస్తుంది. సంతానం నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు,పదోన్నతులు పొందుతారు.

కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. పెట్టుబడులకు అన్ని విధాల అనుకూలం.

మీనం: జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News