Monday, July 8, 2024

శనివారం రాశి ఫలాలు(22-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు.ప్రారంభించిన పని విజయవంతం అవుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషానికి కారణం అవుతుంది.

వృషభం – ముఖ్యమైన వ్యవహారాలలో తోటి వారి సహాయం అందుకుంటారు. వ్యతిరేక వాతావరణం లోను అనుకూల ఫలితాలను సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.

మిథునం – భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త వింటారు.

కర్కాటకం – అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోకండి.

సింహం –  మొండికి పడిన అన్ని పనులు నిదానంగా సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి.

కన్య – శత్రువులతో తగిన జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన అమ్మకాలు కొనుగోళ్లు  కొనసాగిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

తుల – కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తారు. దీని వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చికం – ప్రారంభించబోయే పనులలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని తెచ్చిపెడతాయి.

ధనుస్సు – ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు  వింటారు. కుటుంబ వాతావరణం  అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం – దూర దృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. ఋణ సమస్యలు తగ్గుతాయి. మిశ్రమ వాతావరణం ఉంటుంది.

కుంభం – చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థికంగా కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.

మీనం – కీలక వ్యవహారాల్లో ధనం చేతికందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిదని గ్రహించండి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News