Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(22-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనాభివృద్ధి.

వృషభం: ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. కొన్ని విషయాలలో అనుకోని ఊరట చెందుతారు.

మిథునం: పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.

కర్కాటకం: కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రముఖుల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. వాహనయోగం గోచరిస్తున్నది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు.

సింహం: ఆర్థిక లావాదేవిలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు,భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఎప్పటినుండో తీసుకోవాలనుకున్న వస్తువులు తీసుకుంటారు.

కన్య: పెట్టుబడులకు తగిన లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కొన్ని పనులలో జాప్యం తప్పదు.

తుల: మిత్రులతో ఏర్పడిన ఆర్థిక వివాదాలు పరిష్కరించుకుంటారు.ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చికం: వృత్తి- వ్యాపారాలలో లాభాలు అర్జిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధనస్సు: జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు సమసిపోయి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. ఇంటాబయటా కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి.

మకరం: నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహన సౌఖ్యం పొందుతారు. పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు .

కుంభం: ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురైనా సహుద్యోగుల సహాయ సహకారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువులను,స్నేహితులను కలిసి కష్టసుఖాలలో పాలుపంచుకుంటారు.

మీనం: శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలకు నాంది పలుకుతారు. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు.మానసిక ఆనందం కలిగివుంటారు.

సోమేశ్వర శర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News