Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(23-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధిచెందుతాయి.

వృషభం –పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ధనలాభం.

మిథునం –ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం –పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

సింహం –కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు. సోదరుల నుండి ఆస్తి లాభం.

కన్య –దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ద్వారా ఆనందం కలుగుతుంది. కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు.

తుల –వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరులకలయిక.

వృశ్చికం –చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు, వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. పరపతి పెరుగుతుంది.

ధనుస్సు –బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగప్రాప్తి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం –వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు.

కుంభం –ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

మీనం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News