Thursday, December 19, 2024

శనివారం రాశి ఫలాలు(23-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఎంత కృషి చేసిన ఫలితం ఉండదు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా మీ సహాయంతో అధిగమించి సాధిస్తారు.స్వల్ప ధన లాభాలు పొందుతారు.

వృషభం:ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

మిథునం: పాత, కొత్త మిత్రుల కలయిక, ఆనందోత్సవాలు వెల్లువిరుస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్థాయి. వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: కాంట్రాక్టులు దక్కుతాయి.చేసే పనులలో అలసత్వం వద్దు. సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా మీ ప్రయత్నాలు సాగిస్తారు. కొంత రుణ బాధలు తప్పవు.

సింహం: సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి.జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్వల్పధన లాభం. నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య: ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలదు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల: సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు కొంత వరకు సఫలీకృతం అవుతాయి.

వృశ్చికం: అనుకోని వారి నుండి వచ్చే ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.

ధనస్సు: శ్రమ అధికం అయినా ఫలితం కనిపించదు. సోదరులతో ఏర్పడిన వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధన లాభం పొందుతారు కానీ నిలవదు.

మకరం: ఆర్థిక పరిస్థితి మరీ అంత గొప్పగా ఉండదు.చేసే పనులలో ఆటంకాలు ఎదురైనా కుటుంబ సభ్యుల జోక్యం వలన సకాలంలో పూర్తి చేస్తారు. రుణం కోసం ఎదురుచూపులు తప్పవు.

కుంభం: విద్యార్థులకు అనుకున్నంత గుర్తింపు లభించదు. విందు వినోదాలలో కాలం గడుస్తుంది.ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు ఎదురైన అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల ద్వారా కీలక సమాచారం అందుతుంది.

మీనం: సహోదరుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.ఆకస్మిక ధన లాభం శుభకార్యాలలో పాల్గొంటారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News