Sunday, December 22, 2024

సోమవారం రాశి ఫలాలు(24-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. సంతానం మంచి స్థితికి చేరుకొనడానికి గాను మీరు చేస్తున్న కృషి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం – పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. లిఖితపూర్వక ఒప్పందాలను కుదుర్చుకొని లాభ పడగలుగుతారు.

మిథునం – వ్యాపారస్తులు ప్రజాకర్షణ పథకాలను అవలంబించి సత్ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఆసక్తిని చూపుతారు.

కర్కాటకం – కార్యాలయంలో వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు.

సింహం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ధైర్యం లేని మనిషిగా మీపై దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి. అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.

కన్య – ముఖ్య సమస్యలు ప్రాథమిక దశలోనే సర్దుబాటు కావడం వలన మనశ్శాంతిని పొందుతారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధు వర్గం మీ చేతిలో లేని పనులను చేసి పెట్టమని ఒత్తిడికి లోను చేస్తారు.

తుల – నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

వృశ్చికం – ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే సమసిపోతాయి. కుటుంబ సమస్యలు ఎదురైన అధికమిస్తారు.

ధనుస్సు – నూతన పెట్టుబడులలో తొందరపాటు వద్దు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.  ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం మంచిది కాదు.

మకరం – నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు.గృహ కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు. వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

కుంభం – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.మీకు నచ్చన విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులలో తొందరపాటు వద్దు.

మీనం – కొన్ని ఆర్థిక కారణాలవల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News