Sunday, June 30, 2024

మంగళవారం రాశి ఫలాలు(25-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీ అభిరుచులను మార్చుకోగలుగుతారు. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు.

వృషభం – స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వివాదాలు, గృహోపకరమైన పరికరాలు, ఇవ్వవలసిన రుణాలు మొదలైన విషయాలన్నీ మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి.

మిథునం – సంతాన క్షేమం, పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాలానుగుణంగా ప్రవర్తించడమే విజయానికి మార్గమని గుర్తించండి. మీ సహాయ సహకారాలు అందరికీ అందిస్తారు.

కర్కాటకం – పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి- ఉద్యోగాలపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

సింహం – మీ  నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. మెలకువతో వ్యవహరించడం చెప్పదగినది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వద్దు.

కన్య – ఆరోగ్య విషయంలో మెలకువలు పాటించండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.కొన్ని అవకాశాలు చేతికంది వస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

తుల –  అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. స్వల్ప ధన లాభం గోచరిస్తుంది.

వృశ్చికం – ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు. చెవి, ముక్కు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనవలసి రావచ్చు, జాగ్రత్తలు పాటించండి.

ధనుస్సు – మీ వ్యక్తిగత గౌరవం మరింతగా పెరుగుతుంది. శుభకార్యాలు సానుకూల పడతాయి. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం – దూరమైన సన్నిహిత వర్గం తిరిగి చేరువవుతారు. ఆర్థిక ప్రణాళికలను క్రమ పద్ధతిలో రూపొందించుకోగలుగుతారు. వృత్తి- ఉద్యోగాల పరంగా అధిక శ్రమను కనబరుస్తారు.

కుంభం – అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లాభపడతారు. పరపతి కలిగిన వారితోటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.

మీనం – తొందరపాటుతనం అహంభావ ధోరణి విడనాడగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.  జీవిత భాగస్వామితో సలహాలను సంప్రదింపులను సాగిస్తారు.దైవ సందర్శన చేస్తారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News