Saturday, June 29, 2024

గురువారం రాశి ఫలాలు(27-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృషభం – ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి- వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన చర్చలు ఊపందుకుంటాయి.

మిథునం – వృత్తి ఉద్యోగ విషయాలలో కఠినంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు. ఓర్పును అధికంగా కనబరుస్తారు.రుణాలు మంజూరు అవుతాయి.

కర్కాటకం – శారీరక శ్రమ పెరుగుతుంది.పై అధికారుల ప్రవర్తన మిమ్మల్ని కొంత నిరుత్సాహపరుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది.రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం – వృత్తి ఉద్యోగాలపరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య – వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దైనందిన కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులను చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

తుల – సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. కొత్త రంగాలలో అనుభవం సాధించడానికి శ్రీకారం చుడతారు.

వృశ్చికం – వాయిదా చెల్లింపుల పద్ధతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి గాను నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించండి.

ధనుస్సు – ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరిస్తారు.

మకరం – ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇతరులు ఇచ్చే సలహాలను మీరు పాటించరు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.అవసరానికి ధనం చేతికి అందుతుంది.

కుంభం – స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

మీనం – అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News