Monday, December 23, 2024

బుధవారం రాశి ఫలాలు(27-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు.

వృషభం – అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పట్టుదలతో పనులు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంతానమునకు నూతన విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మిథునం – ఋణవత్తిడుల నుండి బయటపడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

కర్కాటకం – బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు

సింహం – పనులలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఋణవత్తిడుల నుండి బయటపడతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.

కన్య – ఆకస్మిక ధనలాభం పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండటం మంచిది. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.ఆకస్మిక  ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల – ఏది మాట్లాడినా విరోధాలు వస్తాయి. చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులలో నిదానం చాలా అవసరం. దూరప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్యావకాశాలు లాభిస్తాయి. మంచికి పోతే చెడు ఎదురయినట్టుగా పరిస్థితులు ఉంటాయి.

వృశ్చికం – బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. క్రయవిక్రయాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వస్తు లాభం

ధనుస్సు – దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలలో చురుకుగా పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానమునకు నూతన ఉద్యోగావకాశం పొందుతారు.

మకరం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరుల కలయిక

కుంభం – మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ముఖ్యమైన వ్యక్తుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ప్రయాణాలు

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఋణాలు తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News