Sunday, November 17, 2024

గురువారం రాశి ఫలాలు(28-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: వివాదాలకు దూరంగా ఉండండి. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.పనులు నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు పొందుతారు.

మిథునం: సంఘంలో గౌరవం పొందుతారు. సన్నిహితులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు.దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు.

కర్కాటకం: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బాకీలు వసూలు అవుతాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

సింహం: సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. స్వల్పధన లాభం పొందుతారు.

కన్య: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.విలువైన వస్తువులు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల: ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పెడతాయి. వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి.

ధనస్సు: ఆదయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. వృత్తి- ఉద్యోగ,వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం: దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి.ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. పనులు నిదానంగా సాగుతాయి.రుణ బాధలు తప్పవు. దూర ప్రయాణాలు లాభిస్తాయి.

కుంభం: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్వల్ప ధన లాభం.

మీనం: సంఘంలో విశేష గౌరవం పొందుతారు.జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభాలు పొందుతారు. రుణ బాధలు తొలుగుతాయి.సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News