Sunday, December 22, 2024

శనివారం రాశి ఫలాలు(28-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- పనులలో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థికపరిస్థితిఅనుకూలంగా ఉంటుంది. ఋణవత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలుపొందుతారు. శుభవార్తలు తెలియవస్తాయి.

వృషభం :- కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారంఅందుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వాహన సౌఖ్యం గోచరిస్తున్నది.

మిథునం:-. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ సంకల్పంతో అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. మిత్రులతోఏర్పడినవివాదాలు పరిష్కరించుకొంటారు.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కర్కాటకం:- నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలోవిజయం సాధిస్తారు. సహోదరి వర్గంతో ఆనందంగా గడుపుతారు.గృహ, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహం:- ఆరోగ్య, వాహన విషయాలలో నిర్లక్ష్యం తగదు. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.తగాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. విద్యార్ధులకి చదువుపై శ్రద్ద అవసరం. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులను కొనితెచ్చున్నవారు అవుతారు.

కన్య :- జీవితభాగస్వామి సలహాలతో నూతనకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వనాలు ఆశ్చర్యపరుస్తాయి.అనుకోని విధంగా ధన, వస్తు లాభాలు పొందుతారు.  భూవివాదాలుతీరి లబ్ధిపొందుతారు.

తుల:- ఆర్థికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక. ఋణబాధలు తీరి ఊరట చెందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సన్నిహితులకి సహాయసహకరాలు అందిస్తారు. క్రయవిక్రయాలలోలాభాల బాట పడతాయి.

వృశ్చికం :- ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగాసాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.

ధనుస్సు:- ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త పనులుచేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. ఋణాలు బాధలు తీరుతాయి. సంతానానికి  కార్యజయం లభిస్తుంది.

మకరం :- ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. అలసట ఎక్కువై అనుకున్న పనులలో జాప్యం జరుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.జీవితభాగస్వామి నుండి సహాయసహకారాలు అందుతాయి. స్వల్ప ధనలాభం ఉంటుంది.

కుంభం :- ముఖ్యమైన నిర్ణయాలలో పెద్దలు, జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. కోపతాపాలకు దూరంగాఉండండి. భూవివాదాలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువుల నుండి ఆదరణ అంతగా అందదు. స్వల్ప జాగ్రత్తలు అవసరం.

మీనం :- మంచి పనులు చేయాలని సంకల్పించుకుంటారు. కానీ కార్యాచరణలోకి రావు. అదే మీ పరపతిని తగ్గిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖుల కలయిక. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విందువినోదాలు శుభకార్యాలలోపాల్గొంటారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News