Sunday, January 19, 2025

శనివారం రాశి ఫలాలు(29-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన వ్యవహారాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలావరకు ఫలిస్తాయి.

వృషభం – వృత్తి – ఉద్యోగాలపరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు. స్వయంకృతాపరాదాలు చోటు చేసుకుంటాయి.

మిథునం – మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతని ఇస్తారు.

కర్కాటకం – గతంలో వద్దనుకున్న అవకాశాలకు తిరిగి అనుకూలం చేసుకున్న ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం – ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సమయమనం పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు ఇంచుమించుగా అన్నింటిలో ఎంతో కొంత లాభ  పడగలుగుతారు.

కన్య – ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు.ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిపై దృష్టిని సారిస్తారు.  .

తుల – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చికం – ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. స్పెక్యులేషన్ మధ్యస్థంగా ఉంటుంది. మీ మీద ఉన్న నమ్మకమును రుజువు చేసుకుంటారు. రాజకీయ వ్యవహారాలు చక్కబడతాయి .

ధనుస్సు – వ్యాపార పరంగా చెప్పుకోదగిన లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు. సంతాన విద్యా విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు. గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

మకరం – వ్యతిరేక వాతావరణం లోను అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు బాధించే సూచనలు ఉన్నాయి. చాలా వరకు విషయాలలో సమర్థవంతంగా నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు.

కుంభం – సహోదర సహోదరి వర్గమునకు మీ శక్తికి మించి సాయపడాల్సి వస్తుంది. సహుద్యోగులతో సామరస్యంగా మెలిగి లాభపడతారు. స్పష్టమైన విధానాలను అవలంబిస్తారు.పోటీ తత్వాన్ని పెంచుకుంటారు

మీనం – ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం, నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News