Sunday, January 19, 2025

శుక్రవారం రాశి ఫలాలు(29-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.శ్రమ అధికంగా ఉంటుంది.సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వస్తు లాభం. కొంత ఒడిదుడుకులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతారు.

వృషభం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు.స్వల్పధన లాభం.చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు.

మిథునం: వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.ఊహించని అవకాశాలు అందుకుంటారు.విందు వినోదాలు,శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

కర్కాటకం: జీవిత భాగస్వామి సలహా పై నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.

సింహం: వాహనాలు,వస్తువులు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.

కన్య: దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.వాహనయోగం గోచరిస్తున్నది.భూవివాదాలు తీరి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

తుల: తొందరపడి ఎదుటివారితో వాగ్వివాదానికి దిగవద్దు.పనులలో నిదానం అవసరం. రుణ బాధలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం: మీ కృషి ఫలిస్తుంది. దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. భూ, షేర్లు క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

ధనస్సు: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి,వృత్తి- వ్యాపారాలు విజయ పథంలో సాగుతాయి. స్వల్ప ధన లాభం పొందుతారు.

మకరం: నూతన ప్రయత్నాలలో అడ్డంకులు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు.జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు.రుణ బాధలు తప్పేలా లేవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి.

కుంభం: ఇంటాబయటా మీదేపై చేయిగా ఉంటుంది. బంధువుల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు.కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సొంత ఆలోచనలు శ్రేయస్కరం.కొన్ని విషయాలలో అప్రమత్తత అవసరం.

మీనం: వృత్తి- ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఎన్ని బాధ్యతలు పెరిగినా తరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన పెట్టుబడులు, కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం. వాహనయోగం ఉన్నది.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News