Monday, December 23, 2024

శుక్రవారం రాశి ఫలాలు (16-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –  పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం – అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది.

మిథునం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

కర్కాటకం – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. శుభకార్యాల్లో చురుకుగా పాల్గొరటు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.

కన్య – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుండి సహాయం అందిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. వస్తు లాభం.

తుల – మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం – బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. భూముల క్రయవిక్రయాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు – పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. సంఘంలో  గౌరవం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మకరం – రుణాలు తీరుస్తారు. బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు. వాహన యోగం. నూతన మిత్రులు పరిచయమైన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు, వస్త్రాలు నుగోలు చేస్తారు.

కుంభం – ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

మీనం – ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News