Sunday, January 19, 2025

బుధవారం రాశి ఫలాలు (13-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. పరీక్షలకు సన్నద్ధం అవుతారు.

వృషభం – మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సంతానమునకు నూతన విద్యావకాశాలు. వాహన యోగం.

మిథునం –  పనులలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగప్రాప్తి.

కర్కాటకం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. కాంట్రాక్టులు అందిపుచ్చుకుంటారు.

సింహం – పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కార్యజయం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు సేకరణ.

కన్య – మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి. శుభవార్తలు.

తుల – చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు.

వృశ్చికం – ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు.

ధనున్సు – కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు.

మకరం – సంతానం నుండి విలువైన సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి.

కుంభం – వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలాభం.

మీనం –  ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News