మేషం – చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శన.
వృషభం – దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
మిథునం – కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.నూతన అలవాట్లు ఏర్పరుచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు.
కర్కాటకం – దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
సింహం – రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. విందు, వినోదాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కన్య – దూర ప్రాంతాల నుండి సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది.
తుల – ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు.
వృశ్చికం – పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.
ధనుస్సు – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.
మకరం – ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.
కుంభం – ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.
మీనం – ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కోపతాపాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.