Tuesday, September 17, 2024

నేడు చెన్నైతో కోల్‌కతా ఢీ

- Advertisement -
- Advertisement -

Today IPL match Chennai Super Kings vs Kolkata Knight Riders

 

అబుదాబి: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైజర్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి జోరు మీదున్న చెన్నై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు కోల్‌కతాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. కాగా కోల్‌కతాకు కెప్టెన్ దినేశ్ కార్తీక్ వైఫల్యం పెద్ద సమస్యగా తయారైంది. కార్తీక్ ఇటు కెప్టెన్‌గా అటు బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు.

మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు కూడా ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కమిన్స్ కూడా తన స్థాయికి ప్రదర్శన చేయలేక పోతున్నాడు. ఇయాన్ మోర్గాన్, నితీష్ రానా, శుభ్‌మన్ గిల్‌లు మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. ఈసారైన మిగతావారు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం చెన్నైకి పెద్ద ఊరటనిచ్చే అంశం. డుప్లెసిస్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సమష్టి పోరాటంతో ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో చెన్నై కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News