Monday, December 23, 2024

ఢిల్లీకి చావో రేవో.. నేడు బెంగళూరుతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ చావో రేవోగా మారింది. ఇప్పటికే నాలుగు ఓటములు చవిచూసిన ఢిల్లీ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు బెంగళూరు కూడా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక పోతోంది. 3 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో చాలెంజర్స్ అనూహ్య ఓటమి పాలైంది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం పూర్తిగా పడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది.

గెలిచి తీరాల్సిందే..

మరోవైపు ఢిల్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే. వరుస విజయాలు సాధిస్తేనే ఢిల్లీకి నాకౌట్ అవకాశాలుంటాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీ బలంగానే ఉన్నా విజయాలు మాత్రం సాధించలేక పోతోంది. ఓపెనర్ పృథ్వీషా వైఫల్యం జట్టును వెంటాడుతోంది. షా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లోనూ ఒకప్పటి జోష్ కనిపించడం లేదు. మనీష్ పాండే, రొమాన్ పొవెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ తదితరులు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఢిల్లీకి గెలుపు అవకాశాలుంటాయి.

ఫేవరెట్‌గా..

ఇదిలావుంటే ఆతిథ్య బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక సిరాజ్, పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. దీంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో బెంగళూరుకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News