హైదరాబాద్ : ఆచార్య జయశంకర్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని, సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ స్పూర్తి సదస్సును నిర్వహిస్తోంది. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి లోని మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ సెంటర్ లో ఆచార్య జయశంకర్ 12వ స్మారక సదస్సు జరుగనున్నది.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరు కానున్నారు. జయశంకర్ స్మారకోపన్యాసాన్ని “ అసహన రాజకీయాలు -భారతదేశం” అనే అంశంపై జెఎన్‌యు న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ మొదటి సెషన్ లో ప్రసంగిస్తారు. రెండవ సెషన్ లో తెలంగాణ ఉద్యమకారులను సంఘటితం చేసుకోవడానికి ‘వర్తమాన తెలంగాణ పౌరసమాజం బాధ్యత’ అనే అంశంపై హరగోపాల్, కె. శ్రీనివాస్, కె రామచంద్రమూర్తి, ఆకునూరి మురళి, పాశం యాదగిరి, మురళి మనోహర్, పద్మజా షా, వెంకటనారాయణ, నిరూప్ రెడ్డి లు ప్రసంగిస్తారు.