Wednesday, January 22, 2025

నేడే బిసి గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా 277 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా హాల్‌టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

Also REad: రావి ఆకుపై నూతన సచివాలయ భవనం

ఇంటర్ కోర్సుల ప్రవేశం కోసం 58,113 మంది విద్యార్థులు, డిగ్రీ కోర్సుల కోసం 8,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. హాల్‌టికెట్‌లో ఉన్న పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని మల్లయ్యబట్టు సూచించారు. 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు 69,147 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. వచ్చే నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 299 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మే నెల 2వ తేదీ నుంచి హాల్‌టికెట్స్ అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News