Saturday, November 23, 2024

నేడే చారిత్రక ‘ఇనుగుర్తి’ మండల ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కేసముద్రం : చారిత్రక నేపథ్యం కలిగిన ఇనుగుర్తి గ్రామం నేటి నుండి మండలంగా మారనుంది. ఇప్పటికే అధికార కార్యాలయాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇనుగుర్తి మండల ప్రారంభ ఏర్పాట్లను శనివారం సమీక్షించారు. తహశీల్దారు కార్యాలయాన్ని గ్రామపంచాయితీ ప్రక్కన భవనంలో ఏర్పాటు చేసి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 26న మహబూబాబాద్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి మండలాల ఏర్పాటును తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.101ను జారీ చేసింది.

కోమటిపల్లి, చిన్ననాగారం, అయ్యగారిపల్లి, మేచరాజుపల్లి, ఇతర గిరిజన తండాలు కలిపి ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇది వరకే సీరోలు మండలాన్ని ప్రారంభించగా పలు కారణాల వల్ల ఇనుగుర్తి మండల ప్రారంభం ఆలస్యమైంది. ఎట్టకేలకు మండలం ప్రారంభం అవుతుండటంతో గ్రామప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు కిషన్, కేసముద్రం పిఎసిఎస్ ఛైర్మెన్ ధీకొండ వెంకన్న, సర్పంచ్ దార్ల రాంమూర్తి తదితరులు మండల ప్రారంభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు.

ఇనుగుర్తి తొలి తహశీల్దారుగా దిల్వార్ అబిద్ అలీ

నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండల నూతన తహశీల్దారుగా దిల్వార్ అబిద్ అలీ నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శశాంక శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిద్ అలీ ప్రస్తుతం తొర్రూరు ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలానాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్‌పై ఇనుగుర్తి మండల తహశీల్దారుగా నియమాకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News