Wednesday, January 22, 2025

నేడు క్రిస్మస్ పర్వదినం

- Advertisement -
- Advertisement -

నేడు క్రిస్మస్ పండుగ… ముస్తాబైన చర్చిలు
క్రైస్తవ సోదరులకు సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్: క్రైస్తవ సోదరులు అత్యంత ఘనంగా జరుపుకుకునే క్రిస్మస్ పండుగకు తెలంగాణ రాష్ట్రంలోని చర్చీలు ముస్తాబయ్యాయి. ఏసు క్రీస్తు పుట్టిన రోజున క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మ స్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ కోసం చర్చీలన్నీ ము స్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరగా అలంకరించారు.
సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు బోధనలు శాంతి, ప్రే మ, సౌ భ్రాతృత్వం, సహనం, ఎప్పటికీ అనుసరణీయమని సిఎం అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్ ను జ రుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు.క్రీస్తు బోధనలు ఆచరనీయమని క్రీస్తు మా ర్గము అనుసరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు
బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదర సోదరీమణులు పండుగలా ఆనందోత్సవాలతో జరుపుకుంటారన్నారు. శాంతి సౌభ్రాతృ త్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కెసిఆర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News