Saturday, January 4, 2025

నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవం నిర్వహిస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా సాయింత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు వారు ప్రకటించారు. గురువారం నాడు పౌర్ణమి గరుడసేవ జరగుతుందని, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని టిటిడి అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News