Monday, December 23, 2024

నేడు ఢిల్లీలో లాల్‌దర్వాజా మహంకాళి బోనాలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : దేశ రాజధానిలో ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించే పాతబస్తీ లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి 8వ ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఆలయ ప్రతినిధులు ఆదివారం తరలి వెళ్లారు. దేవాలయ కమిటీ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు బంగారు బోనంతో ఊరేగింపుగా బయలుదేరారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బి.మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్‌లు మాట్లాడుతూ దేశ రాజధానిలోని తెలంగాణ భవన్‌లో 19వ తేదీ సోమవారం సాయంత్రం 5గంటలకు ఫోటో ఎగ్జిబిషన్ పలువురు ప్రముఖులు ప్రారంభిస్తారని, 20వ తేదీ మంగళవారం సాయంత్రం 5గంటలకు ఇండియా గేటు నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తెలంగాణ భవన్‌కు తీసుకొని వచ్చి ప్రతిష్టించుట, 21వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొనుట, ప్రత్యేక పూజలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు బోనం సమర్పణ ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వంద మంది కళాకారులచే కళాప్రదర్శనలు, సాయంత్రం ఆరు గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రులు, ఉన్నతాధికారుల సంపూర్ణ సహకారాలతో గత ఏడేళ్లుగా ఉత్సవాలను ఘనంగ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు పి.విజయ కుమార్, సి.వెంకటేష్, లక్ష్మీనారాయణ గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్, శీర రాజ్ కుమార్, పోసాని సురేందర్ ముదిరాజ్, సభ్యులు రమేష్, వినోద్, టోనీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News