Sunday, December 22, 2024

నేడే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి!

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీల పెళ్ళికి ముహూర్తం దగ్గరపడింది. గత మూడేళ్ళుగా లవ్ లో ఉన్న ఈ ప్రేమజంట బుధవారం ఒక్కటికానున్నారు. గోవాలో బీచ్ ఒడ్డున ఉన్న ఐటీసీ గ్రాండ్ హోటల్ వీరి వివాహానికి వేదిక కానుంది. పెళ్లికి అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, భూమి పెడ్నేకర్, షాహిద్ కపూర్, రితీశ్ దేశ్ ముఖ్, జెనీలియా, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరుకానున్నారు. రకుల్ క్లోజ్ ఫ్రెండ్స్ ప్రజ్ఞా జైస్వాల్, లక్ష్మి మంచు కూడా ఇప్పటికే గోవా చేరుకున్నట్లు తెలుసింది. రకుల్, జాకీల పెళ్లి ఆనంద్ కరాజ్, సింధీ పద్దతుల్లో జరుగుతుంది.

ఈ వివాహ మహోత్సవంలో బాలీవుడ్ మాజీ నటి శిల్పాషెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఒక పంజాబీ సాంగ్ కు నృత్యం చేయనున్నారు. వివాహమైన తర్వాత రకుల్, జాకీ భగ్నానీ జంట హనీమూన్ కు వెళ్లడం లేదని తెలుస్తోంది. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికాకపోవడమే దీనికి కారణం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News