Monday, December 23, 2024

నేడే సద్దుల బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

ఆడిపాడనున్న ఆడబిడ్డలు పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వం ప్రత్యేక
ఏర్పాట్లు గౌరమ్మను సాగనంపడంతో ముగియనున్న ఉత్సవాలు
పూల పండుగకు ముస్తాబైన ట్యాంక్‌బండ్

మన తెలంగాణ/సిటీబ్యూరో : రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజైన సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఆడబిడ్డలు ఆటపాటలతో, పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణం సంతరించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీతోపాటు జిల్లా కలెక్టర్ అధికారులు ట్యాంక్‌బండ్, ఎల్బీస్టేడియంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవం నిర్వహించేందుకు విద్యుత్ కాంతులతో అలంకరణ చేస్తున్నారు. ప్రభుత్వశాఖల మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందిని ప్రత్యేక వాహనాల ద్వారా తరలించి కన్నుల పండుగా జరిపేలా చర్యలు తీసుకున్నారు. పోలీసు, జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారుల ఆడ పడుచులకు ఇబ్బ ందులు లేకుండా తగిన వసతులు కల్పించారు. అదే విధంగా మిగతా జిల్లాలో కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు బతుకమ్మ పండగ చూడముచ్చటగా జరుపుకునేలా ప్రదాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసి, విద్యుత్ కాంతులతో పరిసరాలు మెరిసేలా సిద్ధం చేశారు. వేడులకు ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలతో వచ్చి ఆటాపాటల్లో పాల్గొనేలా చూస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News