Monday, December 23, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతోత్సవాలు

- Advertisement -
- Advertisement -

బిసిలకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజిక సంఘ సేవకురాలు, భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే 193వ జయంతోత్సవాలను జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బిసిలకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు, మహిళలకు అక్షరాలు దిద్దించి మహిళలకు చదువు నేర్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బడుగుల కోసం తన జీవితాన్ని త్యాగం చెసిన సావిత్రిబాయి పూలే 193 వ జయంతి ఉత్సవాలను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలనిబిసి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాదులోని రవీంద్రభారతిలో బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు, ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ హాజరవుతున్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని మహిళలు, బిసి కుల సంఘాలు, విద్యార్థి యువజనలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News