Wednesday, January 22, 2025

నేడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: అఖిల భారత ఎస్‌సి, ఎస్‌టి హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం 11.00 గంటలకు, హుమాయూన్‌నగర్ లోని డాక్టర్ అంబేద్కర్ భవన్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షులు జి. మురళీధర్ రావు తెలిపారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐఎఎస్ కె. శ్రీనివాసులు , ఎఐఎస్‌సి, ఎన్‌ఎస్‌బిసి జనరల్ మేనేజర్ ఎబి ప్రభురాజ్, ఆల్ ఇండియా ఎస్‌సి, ఎస్‌టి ఆర్‌పిఎస్ ఉపాధ్యక్షులు ఆర్. సత్యలింగం, ఎస్‌కెఎన్‌ఎస్‌ఎస్ అధ్యక్షులు జి. సత్యనారాయణ, అడ్వకేట్ ఇ. వినోద్, డాక్టర్ కె. అశయ్య,  ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్ వివేకానంద తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలకు పతిభ పురస్కారాలు ( సర్టిఫికెట్లు ) అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ ఇండియా ఎస్‌సి, ఎస్‌టి హక్కుల పరిరక్షణ సంఘం శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, రామబాయి అంబేద్కర్ మహిళా మండలి అధ్యక్షులు, వివిధ బస్తీల ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రతినిదులు, అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News