Friday, December 20, 2024

నేడే బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ, ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్‌ఎస్‌ది ప్రత్యేక చర్రిత. టిఆర్‌ఎస్ ఆవిర్భావ ఉద్యమం, ఉద్యమ సాఫల్య, రాష్ట్ర సాధన, అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, సుపరిపాలనలోనూ అంతకంటే ప్రత్యేకమైన చరిత్రనే ఆ పార్టీ లిఖిస్తున్నది. ఆ పార్టీ అధినేత, ఉద్యమసారథి. ప్రస్తుత ప్రభుత్వ రథ సారథి సిఎం కెసిఆర్ తరచూ చెప్పే త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ లో అవే త్యాగాల పునాదుల మీద టిఆర్‌ఎస్ పుట్టి, పెరిగి, పెద్దదై, పరిపాలన సాగిస్తున్నది. మన రాష్ట్రం నుంచి మహారాష్ట్ర మీదుగా భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ ప్రగతి ప్రస్థానం నేడు భారత జాతి రాజకీయ అస్థిత్వం దిశగా పురోగమిస్తున్నది. ఉద్యమం నుంచి ఉద్యమం దాకా, తెలంగాణ రైతు నుంచి భారత కిసాన్ దా కా, తెలంగాణ పంచాయితీ రాజ్ నుంచి మహారాష్ట్ర పంచాయితీ రాజ్ దాకా, 2001 లో పార్టీ ఆవిర్భావ సంవత్సరంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి 2 జడ్‌పి చైర్మన్లు, 100 ఎంపిటిసిలు, 85 జెడ్‌పిటిసిలు, 3 వేల సర్పంచులు, 12 వేల వార్డుల్లో విజయ దుందుభి, తిరిగి అదే పరిస్థితి నేడు బిఆర్‌ఎస్‌గా ఆవిర్బవించిన తర్వాత మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడం.

ప్రజా ఉద్యమాన్ని ఓటు శక్తిగా మలిచి పార్లమెంటరీ పంథాకు నిజమైన అర్థాన్నిచ్చిన వొకే వొక్క భారతీయ రాజకీయ నాయకుడు కెసిఆర్. 22 ఏండ్ల కెసిఆర్ ప్రస్థానం ఒక రాజనీతి పాఠం, ప్రపంచ రాజకీయాల్లో లాటిన్ అమెరికా దేశాల్లో సాధించినటువంటి విప్లవ విజయాన్ని గుర్తు చేసే ప్రస్థానమిది. మార్పు అనివార్యం, మార్పు చెందనిదేదీ మనుగడలో కొనసాగలేదు. అదే సామాజిక రాజకీయ సూత్రాన్నిఅనుసరిస్తూ నేడు బిఆర్‌ఎస్‌గా పరిణామం చెందిన టిఆర్‌ఎస్. అప్పటికా 4 సార్లు ఎంఎల్‌గా, రెండుసార్లు మంత్రిగా వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఉమ్మడి శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పదవికి ఏప్రిల్ 21,2001న రాజీనా చేసి, చర్చోపచర్చల తర్వాత, ధృడ చిత్తంతో, ఏకైక లక్షంతో ఏప్రిల్ 27, 2001న టిఆర్‌ఎస్‌ని ఏర్పాటు చేశారు. పదవీ త్యాగ పునాది మీద, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో టిఆర్‌ఎస్ ఆవిర్భవించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News