Sunday, December 22, 2024

దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ జిల్లాః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం నియోజవర్గాల వారిగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు ఏర్పాటు చేసి పారిశ్రామిక రంగంలో జిల్లా సాధించిన ప్రగతి, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, కల్పించిన ఉపాధి అవకాశాలను వివరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి చామకూర మల్లారెడ్డి శామీర్‌పేట మండలం తుర్కపల్లి జినోమ్ వ్యాలీలోని విష్ణు ల్యాబ్ లిమిటెడ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కల్టెకర్ చెప్పారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు మౌలాలిలోని టీఎస్‌ఐఐసీఐ కార్యాలయంలో, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద జీడిమెట్ల ఇండస్ట్రీయల్ అసోసియేషన్ కార్యాలయంలో, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి టీఎస్‌ఐఐటీ కార్యాలయంలో, బాలానగర్ ఏపీఐఈలో జరిగే కార్యక్రమంలో, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చర్లపల్లిలోని సీఐఏ ఆడిటోరియంలో, కాప్రాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సాగునీటి దినోత్సవం, చెరువుల పండుగను విజయవంతం చేయాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే సాగునీటి దినోత్సవం, చెరువుల పండుగను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ అన్నారు. సోమవారం అధికారులతో మాట్లాడుతూ దశాబ్ధి ఉత్సవాలలో ఈనెల 7వ తేదీన సాగునీటి దినోత్సవం, 8వ తేదీన ఊరూరా చెరువుల పండుగను నిర్వహించాలని అన్నారు.

జిల్లా, నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణకు ముందు రైతులు ఎదుర్కొన్న సాగు నీటి కష్టాలు, ఇబ్బందులు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటి రంగంలో సాధించిన ప్రతిని వివరించాలని సూచించారు. ఊరూరా చెరువుల పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, చెరువుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News