Saturday, December 21, 2024

నేడు రెండో విడత ఇంజనీరింగ్ సీట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంసెట్(ఎంపిసి) కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం రెండో విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. రెండో విడతలో మొత్తం 38,318 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, మొత్తం 30,125 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత 12,001 సీట్లు ఖాళీగా మిగిలాయి. రెండో విడతలో కూడా కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొదటి విడతలో కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీల్లో 94.20 శాతం సీట్లు కేటాయించగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 78.70 శాతం సీట్లు కేటాయించారు. ఈసారి సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. రెండో విడతలో కూడా కంప్యూటర్, దాని అనుబంధ కోర్సుల్లో అత్యధికంగా సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News